Sri Jayendravani Chapters Last Page
మనం ఎక్కడ జీవించినా, ఏ భాష మాట్లాడినా, ఏ దేశంలో వున్నా పరమాత్ముని సంతానమే. ఈ సృష్టికంతకు కారణభూతుడైన ఈశ్వరుడొక్కడే. మనతో సహజీవనం చేసే వారందరూ దేవుని బిడ్డలే. మన దేశవాసులంరమూ, భారతదేశ ప్రధాన నగరమైన ఢిల్లీవాసులతో సహా, భారతీయులమనే భావన కల్గి వుండాలి. అదే విధంగా మనం ప్రపంచంలో ఏ దేశంలో వున్నా, ఏ భాష మాట్లాడినా, ఏ మతాన్ని అనుసరించినా భగవానుని బిడ్డలమని మరొకసారి గుర్తుచేస్తున్నా. మన మతాన్ని ధర్మాన్ని అనుసరిస్తూ సర్వమానవ సౌభ్రాత్రుత్వంతో, అందరియెడ ప్రేమను వెదజల్లుతూ ప్రవర్తిస్తే ఈశ్వరుని కరుణా కటాక్షాలకు పాత్రులమై మనం ధన్యమైన సుఖమయ జీవితాన్ని గడప గలుగుతాం.
- శ్రీ జయేంద్ర సరస్వతీస్వామి
ముద్రణ : కమల ఆర్ట్ ప్రింటర్స్, తెనాలి. ఫోన్స్ : 25072, 24472
శ్రీశ్రీశ్రీ కామకోటి పీఠాధిపతుల విజయ యాత్ర
యందలి ప్రముఖ సంఘటనలు సమావేశాలు
8-2-73 కాంచీపురం నుండి బయలుదేరుట
10-2-73 తిరుత్తని దేవాలయ సందర్శనం
13-2-73 నుండి తిరుపతి వాసము -
18-2-73 వేంకటా చలపతి దేవదర్శనము.
14-2-73 శ్రీవారిచే జరుపబడిన కళ్యాణోత్సవం,
సహస్ర కలశాభిషేకం.
15-2-73 తిరుపతిలోని మోపెడ్సు ఇండియా
లిమిటెడ్ కాలనీలో-శ్రీవారిచే పంచగణపతి
ఆలయంలో కుంభాభిషేకం.
3-3-73 కర్నూలు జిల్లా సమీపంలోని ఆలంపూర్‌లో
4-3-73 మహాశివరాత్రి ఉత్సవ కార్యక్రమం.
9-3-73 నుండి హైదరాబాద్ - సికింద్రాబాదులలో
14-3-73 వరకు వసించుట.
21-3-73 వేములవాడ - రాజరాజేశ్వరి క్షేత్రం.
3-4-73 నుండి నాగపూరు - వసంత నవరాత్రి మహోత్సవాలు
14-4-73 వరకు
23-4-73 బ్రహ్మం వద్ద నర్మదానదీ స్నానం
2-5-73 నుండి ఝాన్సి - శంకర జయంతి ఉత్సవాలు
8-5-73 వరకు
11-5-73 నుండి గ్వాలియర్‌లో వాసము
13-5-73 వరకు
15-5-73 ధోల్‌పూర్‌లో వాసము
17-5-73 ఆగ్రా - వపన పౌర్ణమి
18-5-73 నుండి మధుర, బృందావనం, గోకులం -
24-5-73 వరకు బృందావనంలో సప్తాహ భాగవత
పారాయణం.